రానున్న ఎన్నికలలోపు పంచాయతీరాజ్‌ సంస్థలకు వేల పదవులు...

SMTV Desk 2017-11-13 16:01:45  Represent representation of panchayat Raj institutions, telangana state, elections

హైదరాబాద్‌, నవంబరు 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నాటికి మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా , మరో 20 వేల పదవులను తెచ్చి పెట్టనున్నాయి. దీంతో పంచాయతీరాజ్‌ సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్యలు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గాలు,8684 ఉండగా, గ్రామపంచాయతీలు, 87,672 వార్డులు ఉన్నాయి. ఈ సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ (జడ్పీపీ), మండల పరిషత్‌ అధ్యక్షుడు (ఎంపీపీ), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (జడ్పీటీసీ), మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు(ఎంపీటీసీ), గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవులున్నాయి. వీటి సంఖ్య 1,03,682. అయితే 10 జిల్లాలను 31జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా మిగిలిన 30గ్రామీణ జిల్లాలకు జడ్పీ చైర్మన్లు రానున్నారు. అంటే కొత్తగా 21 జడ్పీ చైర్మన్‌ పదవులు రానున్నాయి. ఇక మండల పరిషత్‌ల సంఖ్య 438 నుంచి 550కి పెరగడంతో కొత్తగా మరో 112 మంది ఎంపీపీలు రానున్నారు. వీటితోపాటు ప్రస్తుతం 8684 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఉన్నారు. కొత్తగా 4వేల వరకు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆ మేరకు సర్పంచ్‌ పదవులు 4వేల వరకు అదనంగా వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇలా రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ సంస్థల ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కనీసం మరో 20 వేలు పెరగవచ్చని, మొత్తంగా 1.20 లక్షలకు చేరవచ్చని సమాచారం. పంచాయతీరాజ్‌ సంస్థలు పూర్వపు భౌగోళిక పరిధిలోనే కొనసాగుతున్నాయి. పాలకమండళ్ల గడువు ముగిసేంత వరకు వీటిని రద్దు చేయడం కష్టం. అందుకే రెవెన్యూ పరంగా జిల్లా, మండలాల విభజన జరిగి ఏడాది గడుస్తున్నా, పంచాయతీరాజ్‌ శాఖకు అనువదించుకోలేదు. పాలకమండళ్ల గడువు ముగిసే తరుణంలో వీటిని అనువదించుకుంటారు.