మానసిక ప్రశాంతత కరువవుతోంది..

SMTV Desk 2017-11-13 15:34:45  gowtham model school, students straick, no time sence,

హైదరాబాద్, నవంబర్ 13 : నిత్యం ర్యాంకులకై పరుగులు తీస్తూ, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే కార్పోరేట్ విద్యాసంస్థలు నిర్ణీత సమయ వేళల్ని పాటించకపోవడం వల్ల వారు ప్రశాంతతను కోల్పోతున్నారు. వారికి నిద్ర కరువవుతుందని, నిత్య నరకం అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ గౌతమ్ మోడల్ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ దాదాపు 60 మంది విద్యార్థులు "వి వాంట్ జస్టీస్" అంటూ ధర్నాకు దిగారు. ఉదయం 6:30 నుండి రాత్రి 7:30 వరకు పాఠశాల ఉంటుందని ట్యూషన్ నుండి వచ్చే సరికి రాత్రి 11 అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందు కోసం బాలల హక్కుల సంఘాన్ని సంప్రదించగా ఆ గౌతం మోడల్ స్కూల్ యాజమాన్యంపై కలెక్టర్ కు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.