సిరియాలో దాడుల్లో చిన్నారులతో పాటు 26 మంది పౌరులు మృతి...

SMTV Desk 2017-11-12 16:22:12  Eastern Syria, 26 people died, Russian Air Force

సిరియా, నవంబర్ 12 : తూర్పు సిరియాలోని అల్బూ కమాల్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లో శనివారం రష్యా వైమానిక దళం జరిగిన దాడుల్లో 9 మంది చిన్నారులతో పాటు 26 మంది పౌరులు మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు ప్రకటించాయి. ఉగ్రవాదులు ప్రతిఘటించగా రష్యా సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. అల్‌సుఖారియా ప్రాంతంలో ఓ పునరావాస కేంద్రంపై బాంబులు పడగా ఏడుగురు చిన్నారులు సహా 15 మంది చనిపోయారని, అల్బూ కమాల్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో 11 మంది మృత్యువాత పడ్డారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి. 2011 నుంచి సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 30.30లక్షల మంది కన్నుమూసినట్లు సమాచారం. ఐఎస్‌ ఉగ్రవాదుల చెర నుంచి వివిధ ప్రాంతాలను విముక్తి చేస్తూ వస్తున్న సైన్యం, రెండు రోజుల క్రితం అల్బూకమాల్‌పై దాడులు ప్రారంభించింది.