కాలాన్ని దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే

SMTV Desk 2017-06-10 18:04:09   South Central Railway,Advanced Blankets Focus on rain and cold,

హైదరాబాద్, జూన్ 10 : ఫస్ట్ క్లాస్ రైల్వే ప్రయాణికులకు అధునాతన బ్లాంకెట్లు అందజేస్తామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వర్షాకాలం మొదలవడంతో ఫస్ట్ క్లాస్ రైల్వే ప్రయాణికులకు చలితో కూడిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆలోచించి, రైల్వే ఫస్ట్ క్లాస్ ఏసీల్లో అధునాతన బ్లాంకెట్లు ప్రయాణికులందరికి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వర్షాకాలంతో పాటు వచ్చే చలికాలం కూడా ఉపయోగ పడుతుందన్న ఆలోచన మేరకు ఇలాగే దీన్నికొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం శుక్రవారం రోజున విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా తెలిసింది.