ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ తీసుకురావాలని లేదు :ఆర్‌బీఐ

SMTV Desk 2017-11-12 14:57:16   Islamic banking, Reserve Bank of India, central government

న్యూఢిల్లీ, నవంబర్ 12 : దేశ ప్రజల ప్రయోజనాలు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ తీసుకురావాలన్న ఆలోచన లేదనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అనేది వడ్డీ రహిత బ్యాంకింగ్‌ విధానం. ఈ బ్యాంకింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని 2008లో అప్పటి రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై పరిశీలనలు జరపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐలోని ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ గ్రూప్‌(ఐడీజీ).. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లోని న్యాయబద్ధమైన, సాంకేతిక, రెగ్యులేటరీ సమస్యలను పరిశీలించింది. దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థికశాఖకు నివేదిక పంపింది. అయితే ప్రసుత్తం అలాంటి ఆలోచనే లేదని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. ఈ బ్యాంకింగ్‌ విధానాన్ని అంచెలంచెలుగా తీసుకొస్తే బాగుంటుందని ఐడీజీ నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిమరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.