రికార్డు స్థాయిలో "గుడ్డు" ధర

SMTV Desk 2017-11-12 12:00:40  egg rates increase, Prices will increase,

అమరావతి, నవంబర్ 12 : కార్తీక మాసం ముగుస్తున్న తరుణంలో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. గరిష్టంగా కోడిగుడ్డు ధర రూ.5 వరకు పెరిగి వినియోగదారులకు చేరేసరికి రూ.6 వరకు అవుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. ఈ నెల మొదట్లో గుడ్డు ధర రూ.4.20గా ఉంది. పది రోజుల్లో 50పైసలు పెరిగి శనివారం నాటికి రూ.4.70కి చేరింది. కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మూడేళ్ల కిందట రూ.4.30 గరిష్ఠంగా దక్కింది. తర్వాత క్రమంగా పడిపోయి౦ది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కోడిగుడ్డు ధర సగటున రూ.3.82 మించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధర పెరిగిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పది రోజుల్లో సగటు ధర రూ.4.45 అయింది. పెరిగిన ఈ గుడ్డును కొనడానికి పేదలకు కాస్తంత కష్టమనే చెప్పాలి. ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.