అక్కడి యువతుల జుట్టు ముడి ప్రత్యేకత...

SMTV Desk 2017-11-12 11:22:33  long hair, China Huangso Yao, china

చైనా, నవంబర్ 12 : పొడువు జుట్టంటే ఇష్టలేని వారంటూ ఉండారు. కానీ ఈ రోజుల్లో పొడుగు జుట్టు అనేది 100 మందిలో ఒక్కరికి ఉండే పరిస్థితికి వచ్చింది. కారణం కాలుష్యమనే నిసందేహంగా చెప్పవచ్చును. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడుతూ కనిపించాలని కోరుకోని యువతులుంటారా చెప్పండి.... ఎన్నిచేసిన ఫలితం లేకపోలేదు. ఈ జుట్టు విషయంలో చైనా హువాంగ్లుఓ యావో ప్రాంత అమ్మాయిలకు అదో వరం. ఏకంగా గిన్నిస్‌ రికార్డునే సొంతం చేసుకున్నారా యువతులు, ఎనభైఏళ్లు వచ్చినా జుట్టు నెరవదు. పైగా ఒత్తుగా, దాదాపుగా ఏడు అడుగుల వరకూ పెరుగుతుంది. అందుకే వాళ్లు గిన్నిస్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. రహస్యమేమిటో అని అడిగితే పులిసిన బియ్యం కడిగిన నీటిని తలకు రాసుకోవడమేనని చెబుతారు. బియ్యం కడిగిన నీటిని ఒక రోజంతా పులియబెట్టి దాన్ని తలకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తారు. జుట్టు త్వరగా నెరిసేలా చేసే, రాలిపోవడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నమ్ముతారు. అంతే కాదు ఆ నీటిలో ఖనిజాలూ ఎక్కువగా ఉంటాయి. జుట్టుకు కావాల్సిన విటమిన్‌ కె కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. కుదుళ్లు గట్టిపడి, జుట్టు ఆరోగ్యంగా మారుతుందని చెబుతారీ అమ్మాయిలు. ఇక, ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. వీళ్లు ఆ జుట్టు ముడి వేసుకునేదాన్ని బట్టి పెళ్లయిందో లేదో కూడా తెలుసుకోవచ్చట. జుట్టంతా పైకి తీసుకొచ్చి చుట్టలా చుడితే.. పెళ్లయిందని అనుకోవాలి. అలా చుట్టుకుని మధ్యలో చిన్న కొప్పులాంటిది పెట్టుకుంటే పిల్లలున్నారని అర్థం. అలా కాకుండా జుట్టుకు ఏదయినా వస్త్రాన్ని చుట్టుకుంటే.. భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటారట. ఓ జుట్టులో ఇన్ని రకాల విధానాలను చూపించటంలో అక్కడి యువతుల ప్రత్యేకమాట...