అణ్వాయుధాల అభివృద్దిని అడ్డుకోలేరు : కిమ్ జాంగ్

SMTV Desk 2017-11-12 10:57:00  North Korean President Kim Jong, Donald Trump, controversy

ఉత్తరకొరియా, నవంబర్ 12 : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మండిపడ్డారు. తనను భయపెట్టి అణ్వాయుధాల అభివృద్దిని అడ్డుకోలేరని కిమ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రంప్ యుద్దాన్ని అడుక్కు౦టున్నారని దుయ్యబట్టారు. ఇకపై అణ్వాయుధాల అభివృద్దిని మరింత పెంచుతామన్నారు. తాజా ప్రకటనతో కిమ్ ను దారిలోకి తీసుకురావచ్చని భావించిన అమెరికా ఆశలకు భంగం వాటిల్లింది. ఎట్టకేలకు అణ్వాయుధాల తయారీని ఆపలేరన్న కిమ్, ట్రంప్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది.