తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..

SMTV Desk 2017-11-11 15:01:20  KTR In Legislative Council meeting, drinking water issue.

హైదరాబాద్, నవంబర్ 11 : నగరంలో తాగునీటి సమస్యలకు శాశ్వత౦గా వీడ్కోలు పలకాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా శాసన మండలిలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి సమస్యలు రాకుండా రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. ఈ మేరకు కేశవాపురంలో 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌.. చౌటుప్పల్‌ వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లను పిలిచి పనులను చేపట్టనున్నామని వెల్లడించారు.