అధ్యక్షుల మధ్య గ్రీన్ వార్

SMTV Desk 2017-06-10 16:52:33  War between presidents,America,North koria,Trump,Kim jang un

ఉత్తర కొరియా, జూన్ 10 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్.. ఇద్దరికీ మధ్య విపరీతంగా విబేధాలు ఉన్నాయని ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. కిమ్ జాంగ్ ప్రపంచ వినాశకారి అనీ, వరుస అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచ దేశాలను నాశనం చేసే శక్తిని సంపాదించుకుంటున్నాడని ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ ఉత్తర కొరియాను వేలెత్తి చూపేలా చేస్తున్నారు. అయితే తనను అడ్డుకునేలా ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాలకు, కిమ్ జాంగ్ తన పదునైన మాటలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 194 దేశాలు సంతకం చేసి అమలు చేయాలనుకుంటున్న పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని ట్రంప్ ఉల్లంఘించడం, వాటిని పట్టించుకోమంటూ తేల్చిచెప్పడంతో కిమ్ జాంగ్ ఉన్ రంగంలోకి దిగారు. "ప్రపంచ వినాశకారిని నేను కాదు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన ఉత్త సెల్ఫిష్".. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రాని ఓ నేత తన గురించి మాట్లాడటం అవివేకమన్నారు. ప్రపంచాన్ని కాలుష్యం బారినుంచి కాపాడాలని 194 దేశాలు సంతకం చేస్తే.. ట్రంప్ మాత్రం వెనకడుగు వేస్తూ.. వినాశనానికి పునాదులు వేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయం "అహంకారంలో అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది" అన్నారు.