రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా : బుద్ధా వెంకన్న

SMTV Desk 2017-11-10 18:27:07  ycp jagan, tdp leader budda venkanna, actress roja,

అమరావతి, నవంబర్ 10 : అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన జగన్, పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ రాసిన స్క్రిప్ట్ ను ఎమ్మెల్యే రోజా చదవడం, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీకి వస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖరరెడ్డేనని వ్యాఖ్యలు చేశారు. అసలు, రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా? పార్టీ ఫిరాయింపులపై జగన్ చర్చకు రావాలని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒక్క ఎంపీతో అయినా రాజీనామా చేయించావా? అని ఆమెను ప్రశ్నించారు.