ఈ నెల 11న జరగనున్న పన్నుల(జీఎస్టీ ) సమావేశం

SMTV Desk 2017-06-10 15:40:02  tax running ,Council meeting on 11 june ,Union Finance Minister Arun Jaitley

హైదరాబాద్, జూన్ 10 : వచ్చే నెల 1 నుంచి వస్తు, సేవల పన్నును అమలు చేయడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అదే విధంగా ఇందులో భాగంగా రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. బహుశ ఇదే చివరి సమావేశం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించడం జరిగింది. పన్నుల పరిధిలోకి వచ్చే వస్తువులకు పన్ను ఎంత విధించాలి.. ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా చూడటానికి ఏం చేయాలి... తదితర అంశాలపై చర్చించడానికి పన్నుల కౌన్సిల్ ఇప్పటి వరకు 15 సార్లు సమావేశమైంది. అయితే పన్ను విధింపు పై కొన్ని రంగాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తదితరులు పాల్గొంటారు.