అమెరికా అధ్యక్షుడికి తగ్గిన ప్రజాధారణ..!

SMTV Desk 2017-11-10 15:20:28  donald trump, Hillary Clinton, The popularity is low.

వాషింగ్టన్, నవంబర్ 10 : అగ్రదేశానికి 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికై నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కు ప్రజాదరణ తక్కువైనట్లు తెలుస్తోంది. గతేడాది ఎన్నో వివాదాల మధ్య సాగిన అమెరికా ఎలక్షన్లలో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై అనూహ్యంగా విజయాన్ని సాధించి ప్రపంచాన్నే నివ్వెరబోయేలా చేశారు. ఇప్పటి వరకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలలో ఒక మంచి నిర్ణయం లేకపోవడంతో ప్రజల నుండి ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది. ఆయన మాటలన్నీ అబద్దాలేనని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలపడం విశేషం.