రైల్ నిలయంలో మంటలు..

SMTV Desk 2017-11-09 19:38:53  secundrabad railway station, fire accident, tail nilayam.

హైదరాబాద్, నవంబర్ 09 : దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్ నిలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైల్ నిలయ౦లోని పై కప్పుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 నిమిషాల పాటు ఉద్యోగులు, అక్కడి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను ఆర్పారు. పక్కనే గ్యాస్ సిలిండర్ ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.