ఉద్యోగినిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం...

SMTV Desk 2017-11-09 15:26:42  corporater husband fight with officer, akkala kanna, g vani

హైదరాబాద్, నవంబర్ 09: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ వాణిపై కాచిగూడ కార్పొరేటర్ భర్త ఎక్కాల కన్నా దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కాచిగూడ డివిజన్ పరిధిలోని ని౦బోలి అడ్డాలో సురేందర్ అనే వ్యక్తి 50 గజాల స్థలంలో మూడంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా నిర్మిస్తున్నాడు. బుధవారం ఉదయం అంబర్ పేట సర్కిల్-16 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ వాణి సదరు నిర్మాణం వద్దకు వచ్చి అనుమతి పత్రం చూపెట్టాలని ఇంటి యజమానిని అడిగారు. అతను అనుమతి పత్రం చూపెట్టక పోగా, కార్పొరేటర్ చైతన్య భర్త కన్నా కి సమాచారం ఇచ్చాడు. దాంతో అక్కడికి చేరుకున్న కన్నా మహిళా అధికారిణిపై దౌర్జన్యానికి దిగాడు. మాకు చెప్పకుండా ఇక్కడికి వస్తావా అ౦టూ దుర్భాషలాడుతూ, వాణిపై చేయి చేసుకుని తన ఫోన్ లాక్కున్నాడు. దీంతో భయపడి పోయిన ఆ అధికారిణి కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.