రైతుల ఆదాయం రెట్టింపు

SMTV Desk 2017-06-10 14:57:15   Farmers income, Union Home Minister,rajnathsing

హైదరాబాద్, జూన్ 10 : రైతుల ఆదాయాన్ని 2022లోపు రెట్టింపు చేయకపోతే తమకు అధికారంలో అర్హత లేదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వష్టం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దాదాపు ఆరుగురు రైతులు చనిపోవడంతో ఈ సంఘటన ప్రభావంచే మహారాష్ట్రలోని రైతులు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జైపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూదూ లో ప్రజలను ఉద్దేశించి రాజ్‌నాథ్ మాట్లాడుతూ... 2022 లోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని, ఒకవేళ రెట్టింపు చేయలేకపోతే అధికారం తమకు కట్టబెట్టబోమని ముఖాముఖీ చెప్పారని వెల్లడించారు.