కమల్.. దేశానికి క్యాన్సర్ : స్వామి పరిపూర్ణనంద

SMTV Desk 2017-11-09 14:53:32  kamal hasan, Swami Paripurnananda, hyderabad

హైదరాబాద్, నవంబర్ 9 : నటుడు కమల్ హసన్ రాజకీయ ప్రవేశ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రీయ హిందుసేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణనంద మీడియాతో మాట్లాడుతూ కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ కుటుంబానికి చెందిన వాడినని ప్రకటించుకుంటూనే తన వ్యక్తిగత మనుగడ కోసం హిందూ ప్రతిష్టను దిగజార్చడం వెనుక దేశ ద్రోహులు, ధర్మ ద్రోహుల ప్రేరణ ఉందనే సత్యం బట్టబయలై౦దన్నారు. హిందువులు తీవ్రవాదులని, కాషాయ ఉగ్రవాదులని అన్న తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. ఆయన భారతదేశానికి బరువని, దేశానికి క్యాన్సర్ పుండులాంటి వాడని ఇలాంటి వారు దేశానికి ప్రమాదమని ఆరోపించారు.