హైవే రోడ్డు వారం రోజుల్లో పూర్తి కావాలి : తుమ్మల

SMTV Desk 2017-11-09 12:37:48  minister thummala nageshwara rao, yadadri- warangal highway road, telangana

హైదరాబాద్, నవంబర్ 9 : తెలంగాణలోని ప్రముఖ దైవ క్షేత్రాలలో యాదాద్రి క్షేత్రం ఒకటి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళయిన రహదారుల సమస్యను అరికట్ట లేకపోయింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యాదాద్రి-వరంగల్ రోడ్డు అధ్వానంగా ఉందని, వారం రోజుల్లో ఆ రహదారిని మెరుగుపరచాలని భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అయన ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారులతో మాట్లాడారు. ప్రయాణానికి అనువుగా కొత్త హైవే నిర్మించాలని, ప్రజల నుంచి సానుకూల స్పందన రావాలని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం బాధ్యతలు చేపట్టకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆదేశించారు.