అత్యాచారం కేసులో జీవిత ఖైదు

SMTV Desk 2017-06-10 13:24:43  girl gang rep

కరీంనగర్, జూన్ 10 : అత్యాచారం కేసులో ఇద్దరికీ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు. రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ అత్యాచారంలో కేసులో ఒకరికి 20 సంవత్సరాలు మరొకరికి జీవితకాలం శిక్ష విధించారు. కరీంనగర్ జిల్లా చల్లూరు గ్రామనికి చెందిన యువతి (20) శంకరపట్నం మండలం అముదాలపల్లి గ్రామానికి చెందిన గొట్టె శ్రీనివాస్ (22) కాల్వల గ్రామానికి చెందిన ముద్దం అంజయ్య, ఓ బాలుడు (17) వీణవంకలోని పోలిస్టేషన్ లో కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నారు. 2016 లో ఫిబ్రవరి 11 న ఆ యువతిని గ్రామ శివారుకు తీసుకెళ్ళి సాముహిక అత్యాచారం చేసి, సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఆ వీడియోలు బయటకు రావడం తో రాష్ట్రం మొత్తం సంచలనమైంది. కరీంనగర్ జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం విచారించి ముగ్గురు నిందితులు గొట్టె శ్రీనివాస్ కు 20 ఏళ్ళు, ముద్దం అంజయ్య కు జీవిత ఖైది తో పాటు 10 వేల చొప్పున జరిమానా విధించింది. బాలునికి బాలల రక్షణ గృహానికి తరలించామని తీర్పునిచ్చారు.