మెట్రో రైలెక్కిన రాష్ట్ర ప్రథమ పౌరుడు..

SMTV Desk 2017-11-08 18:29:57  trail run metro narasimhan ktr, KTR, Governor Narasimhan, Travel in Metro Rail,

హైదరాబాద్, నవంబర్ 08 : ఎప్పుడెప్పుడా అని హైదరాబాద్ వాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైల్ పట్టాలెక్కింది. ఈ రోజు మెట్రో రైలులో రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నరసింహన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రయాణించారు. ఎస్సార్ నగర్ నుండి మియాపూర్ వరకు వీరి ప్రయాణం సాగింది. మియాపూర్ మెట్రో డిపోను పరిశీలించిన వీరిద్దరూ బేగంపేట్, ఎస్సార్ నగర్ మధ్య ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ మిషన్ వరకు పనులపై ఆరా తీశారు. అమీర్ పేట వద్ద ఓఈటీఎస్ పనులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బేగంపేట నుండి అమీర్ పేట వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ నెల 28 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభించనున్న నేపథ్యంలో మెట్రో రైలు పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో గ్రేటర్ లో మెట్రో పరుగులు పెట్టనుంది.