ప్రపంచ రూపురేఖలు మార్చేవి ఆ మూడే : సత్య నాదెళ్ల

SMTV Desk 2017-11-08 15:40:07  satya nadella tour of india, for publicity of hit refresh, change technology , anil kumble

న్యూఢిల్లీ, నవంబర్ 08 : భారత్ లో తన స్వీయ పుస్తకం "హిట్ రిఫ్రెష్" ప్రచారం కోసం విచ్చేసిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల నిన్న ఢిల్లీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత సమాజం టెక్నాలజీ పై బాగా ఆధారపడి ఉందని రాబోవు రోజుల్లో, మిక్సిడ్ రియాలిటీ, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ పూర్తిగా ప్రపంచ రూపురేఖలు మారుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమ౦లో భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పాల్గోనగా నాదెళ్ళ తనకు ఇష్టమైన విషయాలను పంచుకొన్నారు. మైక్రో సాఫ్ట్ 48 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదూడుకులు ఎదుర్కొందని, చాలా మంది సంస్థ ముగింపు దశకు చేరుకుందని హేళన చేసిన మైక్రో సాఫ్ట్ తన స్థిరత్వాన్ని చాటుకుందని వ్యాఖ్యానించారు.