సీనియర్ ఎన్టీఆర్ వల్లే కాలేదు.. కేటిఅర్ తో అవుతుందా : ఎమ్మెల్యే వంశీధర్

SMTV Desk 2017-11-08 15:39:04  congress mla vamshidhar reddy, NTR, KTR.

హైదరాబాద్, నవంబర్ 08 : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సీనియర్ ఎన్టీఆరే కల్వకుర్తి నుండి పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడున్న ఈ డూప్లికేట్ తారకరామారావు ఎలా గెలుస్తారని వంశీ ఎద్దేవా చేశారు. ఇటీవల కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. వారు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకే సీఎం పదవి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం అంటూ ప్రజలను మభ్యపెట్టారని.. ఇప్పుడు ఆ ప్రమాణాలు ఏమైనట్టు..? వాటన్నింటికి సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.