నోట్ల నిషేద్దంపై మాజీ మంత్రి వరుస ట్వీట్లు....

SMTV Desk 2017-11-08 15:37:45  Demonitisations, Black day, Congress leader and former union minister P Chidambaram, RBI

న్యూఢిల్లీ, నవంబర్ 08 : మోదీ సర్కార్ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నేటికి ఏడాది పూర్తికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజును ‘బ్లాక్‌డే’గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ నిర్ణయాన్ని ఆరోపిస్తూ... చిదంబరం వరుస ట్వీట్లు చేయసాగారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని, లక్షల మంది జీవితాలు, ఉద్యోగాలు కోల్పోయ్యారు. అసలు చెప్పాలంటే ఇది ఎవరూ కాదనలేని సత్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం రూ. 15 లక్షల కోట్లు నగదు చలామణీలో ఉందని, త్వరలో అది రూ. 17 లక్షల కోట్లకు చేరునుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు ఎంతమేర చలామణీలో ఉండాలనేది నిర్ణయం ఆర్‌బీఐ నిర్ణయించాలే తప్ప ప్రభుత్వం కాదన్నారు. ఈ నేపథ్యంలో నోట్లరద్దు వల్ల బాధితులుగా మారిన వారి జీవితాల గురించి తెలుసుకొని ఈ ‘బ్లాక్‌డే’ రోజున వారి కోసం ప్రజలు ప్రార్థన చేయాల్సిందిగా చిదంబరం కోరారు.