ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరికలు..

SMTV Desk 2017-11-08 14:53:52  america president, donald trump, north koriya

ఉత్తరకొరియా, నవంబర్ 08 : ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశ, విదేశీ పర్యటనలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అమెరికాను ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాతో పెట్టుకున్న ఇరాక్, లిబియా దేశాల గతి అదో గతే అయిందని, అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా నిత్యం రెచ్చగొడుతూ ఉన్న ఉత్తరకొరియాకు అదే గతి పడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ పర్యటనలో ఉన్న ఆయన సియోల్ లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. కిమ్ జాన్ పరిపాలనను ఉత్తరకొరియా ప్రజలు ఇష్టపడడం లేదని, ఆ దేశంలో ప్రశాంతత వాతావరణం నెలకొనాలంటే ఆయన ఆటలు కట్టించాలన్నారు. కిమ్ పిచ్చి చేష్టలను అమెరికా ఒంటరిగానే ఆపగలదు. ఈ విషయంపై చైనా, రష్యాలు కిమ్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా ఉత్తరకొరియా పర్యటనను ముగించుకున్న ట్రంప్ మరో పర్యటన నిమిత్తం చైనా బయలుదేరారు.