బంగ్లా అపూర్వ విజయంతో కివీస్ ఇంటిబాట

SMTV Desk 2017-06-10 12:11:28  championstrophy,bangladesh,newzealand, kiwiese,

కార్డిఫ్, జూన్ 10 : బంగ్లాదేశ్ విజృంభణతో కివీస్ ఇంటిబాట పట్టింది. ఛాంపియన్స్ ట్రోఫిలో అపూర్వ విజయాన్ని సాధించి రికార్డుకేక్కింది. బంగ్లాదేశ్ ఆటగాళ్ళ అసాధారణ ప్రతిభతో న్యూజిలాండ్ ఆటగాళ్ళు బెంబేలెత్తిపోయారు. ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో శ్రీలంక...న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ లు అత్యుత్తమంగా రాణించి ప్రధాన టీంలుగా గుర్తింపు సాధించాయి. ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫి చరిత్రలో తిరుగులేని సత్తాను బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ప్రదర్శించారు. తన తొలి మ్యాచ్ లో ఫేవరెట్ ఇంగ్లాండ్ కు గట్టిపోటి ఇచ్చిన ఆ జట్టు..చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కు దిమ్మతిరిగిపోయె దెబ్బకొట్టింది. గ్రూప్-ఎ లో శుక్రవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ 266 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజేతగా నిలిచింది. కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సునాయసంగా బంగ్లాదేశ్ సాధించింది. దాంతోనే కివీస్ ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మెుత్తం మూడు మ్యాచ్ లలో ఒక గెలుపు, ఒక ఓటమి చవిచూడడంతో పాటు మరోమ్యాచ్ రద్దు అయింది. బంగ్లా విజయంలో షకిబ్ అల్ హసన్ కీలకంగా వ్యవహరించారు. ఆయన 115 బంతుల్లో 11 బౌండరీలు, ఒక సిక్స్ తో చెలరేగి 114 పరుగులు సాధించారు. మహ్మదుల్లా 17 బంతుల్లో 8 బౌండ రీలు, 2 సిక్స్ లతో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షకిబ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఏది ఏమైనా ఛాంపియన్స్ ట్రోఫి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. క్రికెట్ లో జరగనిదంటూ ఏమి ఉండదనే తీరులో జరుగుతున్న మ్యాచ్ లు ఆసక్తిని, ఉషారును పెంచుతున్నాయి.