అద్వానీని అనుకరిస్తాం : మోదీ

SMTV Desk 2017-11-08 12:43:31  narendra modi, LK Advani, rahul gandhi

న్యూఢిల్లీ, నవంబర్ 8 : ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా... " అద్వానీ ఒక రాజకీయ దిగ్గజం, ఓ మహా నేత. దేశం కోసం అకుంఠిత దీక్షతో పని చేశారు. అద్వానీ నుంచి సలహాలు తీసుకోవడానికి బీజేపీ కార్యకర్తలంతా అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. బీజేపీ ఎదగడానికి అద్వానీ చేసిన కృషి మరిచిపోలేనిది " అంటూ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ 90వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.