ప్రధానితో బెల్జియం రాజు భేటీ...

SMTV Desk 2017-11-08 11:46:35  narendra modi, Belgium King Philip, hyderabad house

న్యూఢిల్లీ, నవంబర్ 8 : దేశాన్ని అభివృద్ధి పరిచే ఆలోచనలలో ప్రధాని నరేంద్రమోదీ విదేశీ, స్వదేశి పర్యటనలో పాల్గొంటున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బెల్జియం రాజు ఫిలిప్‌ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో హైదరాబాద్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. ఆరుగురు మంత్రులు, 86 బెల్జియం కంపెనీలకు చెందిన సీఈవోలతో భారత్‌ పర్యటనకు ఫిలిప్‌ వచ్చారు. ఫిలిప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌ వద్ద సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాటిని భిన్న రంగాలకు విస్తరించు కోవడం గురించి ఇరువురు నేతలూ చర్చలు జరిపారు. 2013లో పగ్గాలు చేపట్టాక ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.