తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు...

SMTV Desk 2017-11-08 11:26:20  intermediate exams schedule, telangana board, examination branch.

హైదరాబాద్, నవంబర్ 08 : తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమై 20 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ పరీక్షలు మార్చి 1 నుండి 19 వరకు, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు 3 నుంచి 20వ తేదీ వరకు జరిగేలా షెడ్యూల్ ను విడుదల చేశారు. ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్) ఇంటర్‌, ఒకేషనల్‌ సైన్స్‌ కోర్సుల వారికి కలిపి ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. అంతకు ముందే నైతికత, మానవీయ విలువల పరీక్షను జనవరి 29న, పర్యావరణ విద్య పరీక్షను జనవరి 31న నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలలో పాసైతేనే ఇంటర్ సర్టిఫికేట్ ను అందుకునేది. ఈ రెండు పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తారు. అలాగే ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి.