ఉస్మానియా లో చోటు చేసుకున్న ఉద్రిక్తత

SMTV Desk 2017-06-10 11:35:45  gurukkal educational institution, secretary of rs praveenkumar, telangana , unemployment chairman ,koturi manavatharay , tension in o u

హైదరాబాద్ జూన్ 10 : గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారంటు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కొటూరి మానవతారాయ్ చేసిన ఆరోపణలపై శుక్రవారం ఓయూ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలను నిరసిస్తూ సోషల్ వెల్ఫేర్ రెసిడేన్షియల్ విద్యాసంస్థల పూర్వ విద్యార్ధుల సంఘం(స్వేరోస్) ఆధ్యర్యంలో శుక్రవారం ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ ప్రవీణ్ కుమార్ పై చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని వెల్లడించారు. పాలాభిషేకం చేస్తున్న విషయాన్ని గమనించిన ఓయూ విద్యార్ధులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కొటూరి మానవతారాయ్ ఆధ్యర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుసుని స్వేరోస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్నితెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్, విద్యార్ధులను అదుపు చేయడంతో స్వేరోసే నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం మానవతారాయ్ ఆధ్యర్యంలో విద్యార్ధులు ప్రవీణ్ కుమారు దిష్టి బొమ్మను దహనం చేశారు. గురుకుల ప్రతి నోటిఫికేషన్ లో లింగ వివక్షతను తావు లేకుండా నియామకాలను చేపట్టాలని డిమైండ్ చేశారు. ఈ కార్యక్రంలో నిరుద్యోగా జేఏసీ నాయకులు భీంరావు నాయక్, నరేష్, లచ్చిరెడ్డి, యుగంధర్, కిరణ్, ప్రవీణ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.