టీడీపీ పార్టీ నేతలకు సీఎం ఆదేశం...

SMTV Desk 2017-11-07 19:57:11  TDP, AP CM Chandrababu naidu, sigapoor, assembly,

అమరావతి, నవంబర్ 07 : ప్యారడైజ్‌ పత్రాల గుట్టురట్టు కావడంతో జగన్‌ నోరుమెదకపోవడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ప్రస్తావించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎంతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ...పాదయాత్ర చేస్తున్న వ్యక్తి ప్యారడైజ్‌ వివాదంపై సమాధానం చెప్పలేకపోతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సీఎం కుర్చీపై యావ తప్ప ప్రజాసమస్యలపై అతనికి చిత్తశుద్ధిలేనందునే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశంపై సీఎం ఆరాతీశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నేతలంతా తప్పనిసరిగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం ఆదేశించారు. సింగపూర్‌ పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షం నామమాత్రమేనని, అయినా అధికారపక్షం సమావేశాలను పట్టుదలగా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని నేతలకు వివరించిన చంద్రబాబు... మనమూ కూడా అదే తరహాలో రాష్ట్రాభివృద్ధికి శాసనసభని వేదికగా చేసుకుందామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.