దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను ప్రశంసించిన ట్రంప్...

SMTV Desk 2017-11-07 18:46:04  South Korean President Moon, america President tramp, utharakoriya Warnings,

సియోల్‌, నవంబర్ 07 : ప్రపంచ దేశాలకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్న ఉత్తర కొరియాకు నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ తో కలిసి తీవ్ర హెచ్చరికలు చేశారు. ట్రంప్ పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఇన్ని రోజుల నుంచి ఉత్తరకొరియాపై ఉన్న సహనం వారు చేసే పనులకు నశిస్తోందని, ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తొలుత సియోల్‌కు దగ్గర్లోని ఓసాన్‌ ఎయిర్‌ బేస్‌లో తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి దిగిన ట్రంప్‌కు అధికారులు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో బయల్దేరి ఆ దేశంలోని అతిపెద్ద యూఎస్‌ మిలటరీ బేస్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ మూన్‌తో కలిసి అమెరికా, దక్షిణ కొరియా సైనికులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ ఉత్తర కొరియాపై మరోసారి మండిపడ్డారు. అలాగే ఈ సమావేశంలో ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను ప్రశంసించారు.