తప్పును ఇప్పటికైనా ఒప్పుకోవాలి : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

SMTV Desk 2017-11-07 16:15:51  Gujarath assembly elections, Former Prime Minister Manmohan Singh, modi, GST, termination of banknotes

గాంధీనగర్‌, నవంబర్ 07 : నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ... రేపు దేశానికి ఓ బ్లాక్‌డే అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నవంబర్ 8న మోదీ సర్కార్ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు తదుపరి అమలైన జీఎస్టీ పై మాజీ ప్రధాని విమర్శలు చేయబడ్డారు. అమలైన ఈ రెండింటిని న్యాయబద్ధమైన దోపిడీగా ఆయన అభివర్ణించారు. జీఎస్టీ, నోట్ల రద్దు తరువాత దేశంలోని ఆర్థిక వ్యవస్థ పై పెద్ద దేబ్బపడిందని, చిన్న వ్యాపారస్థులు ఆందోళనలు చెందుతున్నరని తెలిపారు. ఈ రెండు నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడడంతో, ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఇందుకు సూరత్‌, ఇతర జిల్లాలోని హ్యాండ్‌లూమ్‌ వ్యాపారాలు మూతపడటమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పనే విషయాన్ని భారత ప్రధాని మోదీ అంగీకరించాలి. నోట్ల రద్దు నిర్ణయం చారిత్రక తప్పిదమని అప్పట్లో పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్యంలో మరోసారి ఆయన గుర్తు చేశారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ వృద్ధి రెండు శాతం పడిపోతుందని దీనిపై గతంలోనే హెచ్చరించానని మన్మోహన్‌ సింగ్‌ వెల్లడించారు.