శాసనసభలో ఆసక్తికరమైన చర్చలు...

SMTV Desk 2017-11-07 14:59:43  assembly, cm kcr, congress, bhatti vikramarka, mim Leader of the party Akbaruddin, hyderabad

హైదరాబాద్, నవంబర్ 07 : భూ సమగ్ర సర్వేపై సోమవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ ఆసక్తికరంగా సాగింది. భూ దస్త్రాల సంస్కరణల కార్యక్రమంపై ప్రధాన విపక్షం కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చారు. తప్పుడు ఆరోపణలతో సభను, ప్రజలను తప్పు దోవ పట్టించ వద్దని సూచించారు. సదా వైనామాలతో పట్టాలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం స్పష్టం చేశారు. దేవాలయ, వాక్ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని ఎంఐఎం ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ పార్టీ శాసన పక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశాడు. భూ దస్తాలా ప్రక్షాళన పేరుతో భూములు లాక్కుంటున్నరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూ దస్త్రాలను రైతు సమన్వయ సమితిలతో ముడి పెట్టడం సరికాదని సీఎం పేర్కొన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.