పనామా పత్రాల కేసు దర్యాప్తు...

SMTV Desk 2017-11-07 11:07:42  The case of Panama documents, Investigation, Black money protection law

న్యూఢిల్లీ, నవంబర్ 07 : పనామా పత్రాల కేసులో దర్యాప్తు జోరుగా సాగుతున్నట్లు తెలిపిన పన్ను శాఖ ఇప్పటివరకు రూ.792 కోట్ల మేర సంపదను ప్రకటించినట్లు పేర్కొంది. వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించి పరిశోధన పాత్రికేయుల అంతర్జాతీయ సమాఖ్య ఏడాది క్రితం బయట పడిన పనామా పత్రాల ఆధారంగా మొత్తం 426 కేసుల్లో 147 చర్యలకు యోగ్యమైనవిగా గుర్తించినట్లు తెలిపింది. నల్ల ధనం నిరోధక చట్టం కింద ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఏడుగురికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. 35 కేసుల్లో సోదాలు చేయడంతోపాటు 11 ప్రాంతాలను పరిశీలించినట్లు పేర్కొన్న ఐటీ శాఖ మొత్తం 426 మందిలో భారతీయులు లేదా భారతీయ సంతతి వారు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వివరించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న బహుళ సంస్థల గ్రూపు ప్రభుత్వానికి ఏడు నివేదికలు సమర్పించినట్లు ఐటీ శాఖ వివరించింది.