చనిపోయినా కనికరం లేదు...మౌనం పాటించని వ్యవహారం పై వివాదం..

SMTV Desk 2017-06-09 18:55:38  austrelia, soudi arebia, meleborne, fifa, qulifier world cup

మెల్ బోర్న్, జూన్ 09 : ఉగ్రదాడిలో చనిపోయిన వారి పట్ల కనికరం చూపలేదు ఆ క్రీడ కారులు. ఒ వైపు తమ ప్రత్యర్థి జట్టు చనిపోయిన వారి ఆత్మ శాంతికై మౌనం పాటిస్తుంటే..అదే మైదానంలో ప్రాక్టిస్ మెుదలుపెట్టారు...ప్రస్తుతం ఈ అంశం వివాదంగా మారి ఆ జట్టును నిషేదించాలనే డిమాండ్ లు వెల్లువెత్తడం ప్రారంభం అయింది. బ్రిటన్ రాజధాని లండన్ లో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు అస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ స్టేడియంలో పుట్ బాల్ క్వాలిఫయర్ వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆట ప్రారంభించడానికి ముందు లండన్ ఉగ్రదాడుల్లో చనిపోయిన ఇద్దరు ఆస్ట్రేలియా వాసుల కోసం మౌనం పాటించాల్సిందిగా ఏషియన్ పుట్ బాల్ కాన్ ఫెడరేషన్ అధికారులు కోరారు. అయితే సౌదీ అరేబియా జట్టు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మ్యాచ్ జరగడానికి ముందు పిచ్ పై ఆస్ట్రేలియా జట్టు మౌనం పాటిస్తుంటే సౌదీ జట్టు మాత్రం వారితో పాల్గొనకుండా ప్రీ మ్యాచ్ వార్మప్, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండిపోవడం ఆస్ట్రేలియన్లకు ఆగ్రహం తెప్పించింది. ఫీఫా వరల్డ్ కప్ లో సౌదీ జట్టు ని నిషేధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మౌనం పాటించాల్సి ఉంటుందని సౌదీ జట్టుకు ముందే తెలుసని అయినా మౌనం పాటించడానికి ముందుకు రాలేదని ఆస్ట్రేలియా సాకర్ ఫెడరేషన్ అధికారులు ఆరోపించారు. అయితే విషయం కాస్తా వివాదాస్పదం కావడంతో సౌదీ జట్టు క్షమాపణ కోరింది. తమ జట్టు ప్రవర్తనకు చింతిస్తున్నామని వారు కావాలని ఇలా చేయలేదని సౌదీ అరేబియన్ పుట్ బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. లండన్ లో జరిగిన ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నామని దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వివరించింది. ఈ విషయంలో సౌదీ జట్టుక్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించి ఉంటే ఫీఫా వారిపై చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.