ఓటుకు నోటు కేసులో పురోగతి లేదు : ఎమ్మెల్యే

SMTV Desk 2017-11-06 17:37:40  revanth reddy cash for vote scam, mla alla krishna reddy submit petition to supreme court, cbi , ysrcp mla

న్యూఢిల్లీ, నవంబర్ 06 : రేవంత్ రెడ్డి "ఓటుకు నోటు కేసు" రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే రెండు సంవత్సరాలైనా కేసు ముందుకి సాగడం లేదు. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీమ్ కోర్ట్ కు పిటిష‌న్ సమర్పించారు. తెలంగాణ ఏసీబీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని, కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. పిటిషన్ పరిశీలించిన కోర్ట్ విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది.