ప్యారడైజ్‌ పేపర్ల కలకలం..

SMTV Desk 2017-11-06 12:24:44  paradise papers leak, icij leak, london queen elizebeth 2, russia president

లండన్, నవంబర్ 06 : పనామా లీక్ తో చాలా మంది ప్రముఖుల నల్ల ధనం జాబితా బయటపడి సంచలనం సృష్టించింది. తాజాగా మరికొందరి అక్రమ ఆర్ధిక లావాదేవీలను ‘ప్యారడైజ్‌ పేపర్లు’ పేరుతో ఇంటర్నేషనల్‌ కన్సోర్టియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) సమాచారాన్ని లీక్‌ చేసింది. ఈ కీలక పేపర్లలో మొత్తం 180 దేశాలకు సంబ౦ధించిన వివరాలు ఉన్నాయి. ఇందులో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ -2 పది మిలియన్ పౌండ్ల ధనాన్ని కేమ్యాన్ దీవులు, బెర్ముడాలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇది నేరం కాదు గాని, ఓ రాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చా..! అన్నదే ప్రశ్నగా మారింది. అదే విధంగా అమెరికా వ్యాపారవేత్త విల్‌బర్‌ రాస్‌కు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బంధువులకు ఉన్నవ్యాపార సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.