హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్!!

SMTV Desk 2017-06-09 17:12:26  hai alert, terrorist attack, hyderabad, chennai, mumbai, bengulure, kolkatta,

హైదరాబాద్‌, జూన్ 09 : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికతో పోలిసులు అప్రమత్తం అయ్యారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ తదితర చోట్ల ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దాంతో ఆయా నగర కమిషనరేట్ ల పరిధిలోని పోలిసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీలు, అనుమానితులను విచారించడం ఇత్యాధి ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటి కారిడార్ లక్ష్యంగా దాడులు జరుగవచ్చన్న హెచ్చరికలతో హైదరాబాద్ నగర పరిధిలోని రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటి కంపెనీలు కొలువైన మాదాపూర్, కోండాపూర్, హైటెక్ సీటి తదితర ప్రాంతాల్లో పోలీసులు చురుగ్గా వ్యహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం.