ఉ. కొరియాను ఎదుర్కొనేందుకు ట్రంప్..

SMTV Desk 2017-11-05 16:03:35  trump in asia tour, trump about north koria

టోక్యో, నవంబర్ 05: ఉత్తర కొరియా సృష్టిస్తున్న అణుయుద్ధ వాతావరణం నేపధ్యంలో ఆసియా పర్యటనకు బయలుదేరిన ట్రంప్ జపాన్ చేరుకున్నాడు. జపాన్ ప్రధాని షింజో అభే తో చర్చల అనంతరం విమానంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన ఉత్తర కొరియా నిర్వహిస్తున్న అణు కార్యకలాపాలను వెంటనే నిలిపి వేయాలని సూచించారు. అణుబాంబులతో ప్రపంచాన్ని బెదిరించాలని చూస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని, ఉత్తర కొరియా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అశాంతి కార్యక్రమాలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాను ప్రపంచ దేశాలు ఏకమై ఖండించాలన్నారు. దీనికోసం అమెరికా అన్ని దేశాల మద్దతు కూడగడుతుందని, అందులో భాగంగా రష్యా అధ్యక్షుడి వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. నార్త్‌ కొరియా దూకుడు విషయంలో రష్యా సహకారం అవసరమని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్ధి ట్రంప్ విజయానికి రష్యా సహకరించడం అందరికి తెలిసిందే.