ట్రంప్ ప్రసంగంలో ఆసక్తికర ఘటన..

SMTV Desk 2017-11-05 15:16:25  america president, donald trump, japan tour,

టోక్యో, నవంబర్ 05 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన నిమిత్తం జపాన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా యోకొటా ఎయిర్‌బేస్‌లో అమెరికా, జపాన్‌ దళాలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తను అలా స్టేజి మీద ప్రసంగిస్తుండగానే తాను వేసుకున్న సూట్ ను విప్పేసి బాంబర్ జాకెట్ ను వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ప్రసంగంలో ట్రంప్ "అమెరికాను తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదు" అని వ్యాఖ్యానించారు.