తండ్రిని చిత్రహింసలు పెడుతున్న కొడుకు

SMTV Desk 2017-06-09 17:06:39  son, biting, fathar

హర్యానా, జూన్ 09 : వృద్దప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కొడుకు చిత్ర హింసలు పెడుతున్నాడు. ఈ సంఘటన హర్యానా లో జరిగింది. మహేంద్ర గడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య తో కలిసి కన్నా తండ్రిని చిత్రహింసలు పెడుతున్నాడు. తన తండ్రిని మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కొడుతున్నాడు. అన్నం పెట్టకుండా కడుపు మడుస్తున్నాడు. కొట్టి కొట్టి అతని వీపు నిండా వాతలు రావడం తో అయన పరిస్థితి విషమంగా మారింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వృద్దుని ఆసుపత్రి లో చేర్పించారు.