కూల్...కూల్ గా...వారిద్దరీ కలయిక

SMTV Desk 2017-06-09 16:34:08  modi, nawaz sharif, asthana, meet pms

అస్తానా, జూన్ 09 : దేశాల మధ్యనే ఉద్రిక్త పరిస్థితులు...తమ మధ్య ఏమాత్రం కాదని నిరూపించారు ఆ రెండు దేశాల ప్రధానులు..సరిహద్దుల వెంబడి చోరబాట్లు, ఆక్రమిత కాశ్మీర్ లో ఆందో ళన కలిగించే పరిస్థితులు ..ఇంకా ఎన్నో వివాదాస్పద అంశాలు సగటు జనంలో ఆవేశాన్ని, ఆందోళనను కలిగించే పరిస్థితులు నిత్యం కోకొల్లలు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు,అ భి ప్రాయ భేదాలు భారత్ , పాకిస్థాన్ ల మధ్య కొనసాగుతునే ఉంటాయి. తాజాగా కుల్ భూషణ్ జాదవ్ కేసు అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. గూడఛర్యం ఆరోపణలపై పాకిస్థాన్ లో కుల్ భూషణ్ జాదవ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే.ఇక మరో వైపు ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి అదుపుతప్పుతోంది. సైనికులు వెళ్లేందుకే ఆస్కారం లేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నట్లు విశ్లేషణల ద్వారా వెల్లడవుతున్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్న దేశాల మధ్య అధినేతల పరస్పర వ్యవహారం ఎలా ఉంటుందనేది అందరికి ఆసక్తికరం. అయితే ఆ దేశాల ప్రధానులు పరస్పరం ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ..సామాన్యుడికి బోధ పడదు..అయితే వారిద్దరీ కలయిక మాత్రం కూల్ కూల్ గా జరిగి రాజనీతి చతురత వ్యక్తం అయింది. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కో అపరేటివ్ సమ్మిట్ లో భారత ప్రధాని నరేంద్ర మోది, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ ఇద్దరూ పరస్పరం కలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని ముచ్చటించారు. షరీఫ్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నారు. 2015 లో ప్రధాని మోదీ లాహోర్ వెళ్ళిన సమయంలో షరీప్ ను కలుసుకున్న తర్వాత రెండు దేశాధినేతలు తిరిగి ఇక్కడే కలుసుకున్నారు. తమ దేశాల పరిస్థితులు కలయికలో వ్యక్తం అవుతాయని సగటు మనిషి భావిస్తాడు..కాని అందుకు భిన్నంగా జరిగిన తీరు మాత్రం సంయమనాన్ని, సహానానికి, ఓర్పు, శాంతికి ప్రతీకగా నిలుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.