రోబోలతో కష్టాలు వుంటాయన్న హాకింగ్స్

SMTV Desk 2017-11-04 18:58:05  Problems, Dangers with robots

న్యూఢిల్లీ, నవంబర్ 04 : భౌతిక విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన స్టీఫెన్ హాకింగ్.. కృత్రిమ మేధతో పని చేయనున్న యాంత్రిక మనుషులతో (రోబో) ప్రయోజనాలే కాదు, ముప్పు కూడ వాటిల్లే అవకాశం ఉన్నదని ఒక కేంబ్రిడ్జ్ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూ లో హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరో ఒకరు తన మేధస్సును తానే పెంపొందించుకునే రోబోను ఆవిష్కరించవచ్చునని అప్పుడు ఊహించని పరిణామాలెదురవవచ్చునని హాకింగ్స్ అభిప్రాయం మనం తప్పక గమనించాలి. నేడు కంప్యుటర్ వైరస్ ను సృష్టించగలవారు ఉన్నట్లుగానే రేపు మరెవరో ఒకరు తనంతట తానుగా తెలివి తేటలు పెంపొందించుకుంటూ వృద్ధి పొందే రోబోను సృష్టిస్తే అది మనుషులకన్నా విజ్ఞతతో వ్యవహరించే అవకాశాలుంటాయన్నది ఈ శాస్రవేత్త హెచ్చరిక. హాకింగ్స్ అభిప్రాయలు ఎన్నోసార్లు శాస్త్రీయంగా గౌరవాన్ని పొందటం తెలిసిందే. ఈయన తన చక్రాలబండికే పరిమితమై శారీరకంగా ఇబ్బందులెదుర్కొంటున్నా మనవ సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. సాంకేతిక విజ్ఞానం మానవ జాతిని నాశనం చేయకుండా కట్టడి చేసుకోవలసి వుంటుందని ఈయన అభిప్రాయం. పెద్ద సమస్యలు విస్తరించి మానవ నాశనానికి ఒడిగట్టే ముందరగానే మనం అలాంటి ఆపదలను గుర్తించగలిగే వీలుండాలి. రోబోలు శక్తివంతమయ్యే ఉద్దేశం లేకుండానే మానవజాతిని అంతం చేసే అవకాశాలుంటాయి. అంటే అసూయతో కాకపోయినా పోటీతత్వం మూలంగా కృత్రిమ మేధతో కూడిన రోబోలు ప్రమాదకారులయ్యే అవకాశం వుంటుందన్నది ఈ శాస్రజ్ఞుని హెచ్చరిక.