పన్నెండు లాజిస్టిక్ హబ్స్ నిర్మిస్తా౦ : కేటీఆర్

SMTV Desk 2017-11-04 15:09:23  IT Minister KTR, logistics hub, jarman association.

హైదరాబాద్, నవంబర్, 04 : నగరం చుట్టూ పన్నెండు లాజిస్టిక్స్ హబ్ నిర్మిస్తామని ఐటీ శాఖ మంత్రి పేర్కొన్నారు. సులభతర వ్యాపారంలో రాష్ట్రం న౦బర్ 1 గా దూసుకుపోతోందన్న కేటీఆర్, జర్మన్ ఏషియా అసోషియేషన్ తో సాంకేతిక అంశాల గురి౦చి ఒప్పందం కుదుర్చుకున్నారు. జహీరాబాద్ లోని నిమ్జ్.. 6 వేల కోట్లతో సమగ్ర వ్యవసాయ ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ ఆగ్రోపోలీన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అయితే శనివారం రోజున ఆహార శుద్ధి పాలసీని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించిన కేటీఆర్, మరో 10 సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియాలో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ, సీఐఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వరల్డ్‌ఫుడ్‌ ఇండియా ఇటు దేశంలో అటు రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి దోహదపడుతుంది. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించడానికి ఇదేసరైన వేదికగా భావించాం. శుక్రవారం 20 సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపాం. రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. 12 సంస్థలతో శనివారం ఒప్పందాలు చేసుకోనున్నాం. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 300 ఎకరాల్లో సమీకృత ఆహార, వ్యవసాయ, ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు దక్షిణ్‌ ఆగ్రో పొలిస్‌ సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి పరోక్షంగా 20వేల మందికి ఉపాధి కలగనుంది. దీనితో పాటు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తాం” అని వెల్లడించారు.