భారత్ సరైన మార్గంలోనే వెళ్తోంది : మోదీ

SMTV Desk 2017-11-04 13:13:34  NRI is an Indian center, delhi, Indian Prime Minister Narendra Modi speech

న్యూఢిల్లీ, నవంబర్ 04 : ప్రపంచబ్యాంకు విడుదల చేసిన వ్యాపారానికి అనుకూల దేశాల జాబితాలో గత మూడేళ్లలో భారత్‌ 42స్థానాలు ముందకెళ్లిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ‘ప్రవాసి భారతీయ కేంద్రం’ లో ఏర్పాటుచేసిన ఇండియా బిజినెస్‌ రిఫార్మ్స్‌ కార్యక్రమానికి మోదీ హజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రపంచబ్యాంకుతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు భారత ర్యాంకుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను కనీసం ప్రపంచబ్యాంకు భవనాన్ని కూడా ఇంతవరకు చూడలేదని.. కానీ భారత్‌ సరైన మార్గంలోనే వెళ్తొందని నమ్ముతున్నానని మోదీ అన్నారు. ఈ ఏడాది మే చివరి వరకు ఉన్న సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేశారని ఆయన తెలిపారు. జీఎస్‌టీ కంటే ముందే భారత్‌ ఇంత ప్రగతి సాధిస్తే, జీఎస్‌టీ వంటి గొప్ప సంస్కరణ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. దీంతో వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది భారత ర్యాంకు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.