జనవరిలో రానున్న "2.ఓ."

SMTV Desk 2017-11-04 12:50:25  2.0 movie, Rajinikanth, Director shankar, laika productions.

చెన్నై, నవంబర్ 04: భారతీయ వెండితెరపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం “2.ఓ”. లైకా నిర్మాణ సారధ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా, సాంకేతిక దర్శకుడు శంకర్ వెండితెరపై అద్భుతాన్నే సృష్టిస్తున్నారు. సుమారు 450 కోట్లతో లైకా సంస్థ ఈ సినిమాను భారీగా నిర్మిస్తో౦ది. భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండడం విశేషం. స్వయంగా మెకానికల్ ఇంజనీర్ అయిన శంకర్ “రోబో” సినిమాలో అద్భుతాన్నే సృష్టించారు. “2.ఓ.” ఒక భారీ గ్రాఫిక్ థ్రిల్లర్ గా సినీ ప్రపంచాన్ని అలరిస్తుందని, హ్యాట్రిక్ విజయం తథ్యమని శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తుంది. “2.ఓ.” చిత్రం విడుదలై ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో సినీ ప్రియులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.