భారత్‌ నౌక ద్వారా ఐసిస్‌కు డ్రగ్స్‌

SMTV Desk 2017-11-04 12:49:33  Drugs for Isis by Indian ship, india, libiya, Italian police

రోమ్, నవంబర్ 04 ‌: డ్రగ్స్‌ను లిబియా తరలిస్తుండగా ఇటలీ భద్రతా దళాలు దాడులు చేశాయి. భారత్‌ నుంచి సముద్రమార్గం ద్వారా లిబియా వెళ్తున్న ఓ నౌకను గోయియా టారో పోర్ట్‌ వద్ద ఇటలీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. అందులో 24 మిలియన్లకు పైగా ట్రమడాల్‌ అనే సింథటిక్‌ డ్రగ్‌ను కనుగొన్నారు. వీటి విలువ దాదాపు 50మిలియన్‌ యూరోలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ట్యాబ్లెట్లను ఐసిస్‌ లిబియాలోని తమ ఉగ్రవాదులకు విక్రయించేందుకు తీసుకెళుతోందని నిఘా అధికారులు భావిస్తున్నారు. 50 మిలియన్‌ యూరోల(భారత కరెన్సీలో దాదాపు రూ.375కోట్లు) విలువైన డ్రగ్స్‌ భారత్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్‌ను భారత్‌లోనే తయారుచేశారా, లేదా ఎక్కడైనా చేసి భారత్‌ నౌక ద్వారా ఎగుమతి చేస్తున్నారా అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వీటిని నొప్పి నివారిణి ట్యాబ్లెట్ గా, సాధారణంగా ఐసిస్‌ ఉగ్రవాదులు ‘ఫైటర్‌ డ్రగ్‌’ గా ఉపయోగిస్తారని సమాచారం.