నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలికిన భారత్ క్రికెటర్లు.

SMTV Desk 2017-11-04 12:05:52  NEHRA INDIAN CRICKETER, RETIREMENT PARTY, SHEWAG , KOHLI

న్యూఢిల్లీ, నవంబర్ 04 : నవంబర్ 1న ఢిల్లీలో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం నెహ్రా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తరువాత భారత్ జట్టు ఆటగాళ్ళు హోటల్ లో నెహ్రాకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటుచేయగా, నెహ్రా కేక్ కట్ చేసి తన మధురస్మృతులను గుర్తుచేసుకున్నాడు. ఈ వేడుకల్లో కోహ్లితో పాటు, మాజీ బ్యాట్స్‌మెన్‌, వ్యాఖ్యాత వీరేంద్ర సెహ్వాగ్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.