అంతరాయానికి క్షమించండి : వాట్సాప్‌

SMTV Desk 2017-11-04 11:38:32  WHATS APP APOLOGISE TO USERS, CRASH DOWN, LOGIN ISSUES, WORLD WIDE

న్యూఢిల్లీ, నవంబర్ 04 : నిన్న ప్రపంచంగా వ్యాప్తంగా ఒక్క రోజులో కొన్ని గంటల్లో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ యాప్ పనిచేయకపోవడంతో వినయోగాదారులు విసుగెత్తిపోయారు. "సర్వర్ లో తలెత్తిన సమస్య వల్ల ఇలా జరిగిందని, ఈ అంతరాయానికి తాము క్షమాపణలు కోరుతున్నాం' అని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. గంట పాటు గ్లోబల్‌ వాట్సాప్‌ యూజర్లు, తమ యాప్‌ను యాక్సస్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను ప్రస్తుతం పరిష్కరించారు. టెక్ట్స్‌ మెసేజ్‌లను పంపడంలోనూ, యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొంది. 25 శాతం సమస్య మెసేజ్‌ను పొందడంలో ఏర్పడిందని, 14 శాతం లాగిన్‌ అవడంలో ఆటంకాలు చోటుచేసుకున్నట్టు ఎక్స్‌ప్రెస్‌.కో.యూకే తెలిపింది. వాట్సాప్‌కు నెలవారీ 1.3 బిలియన్‌ వినయోగాదారులున్నారు.