వైసీపీకి మరో షాక్..

SMTV Desk 2017-11-04 10:46:01  ysrcp mla, vanthala rajeshwari, joined tdp party .

తూర్పుగోదావరి, నవంబర్ 04 : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తన పాదయాత్రకు ముందే ఒక షాక్ తగిలింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా టీడీపీ పార్టీలో చేరనుండగా ఆ పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజేశ్వరి బాటలోనే పలువురు నేతలు మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కాగా ఇప్పటివరకు టీడీపీలో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరగా, ఈ నెల 6 వ తేదీన మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.